లైసెన్స్ వెప‌న్స్ పోలీస్ స్టేష‌న్ లో అప్ప‌గించాలి : సీపీ సాయి చైత‌న్య

by Ratna Kumari |

లైసెన్స్ వెప‌న్స్ పోలీస్ స్టేష‌న్ లో అప్ప‌గించాలి : సీపీ సాయి చైత‌న్య
X

దిశ, నిజామాబాద్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారంతా వారి పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు. సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్టు 1959 ప్రకారం.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయుధ లైసెన్స్ కలిగి ఉన్నవారు తమ తమ లైసెన్స్ డ్ ఆయుధాలను సంబంధింత పోలీస్ స్టేషన్లలో ఈనెల 9 వ తేదీ లోపు జమ చేయాల్సిందిగా పోలీసు శాఖ నోటిఫికేషన్ ను జారీచేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు తమ లైసెన్స్ డ్ ఆయుధాలను జమ చేయనట్లయితే వారిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని సీపీ స్పష్టం చేశారు. ఎవరైనా ఈ ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలోని సంబంధిత అధికారికి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సీపీ సాయి చైతన్య సూచించారు.

Next Story