రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను పర్యవేక్షించిన సీపీ

by Chintha Aamani |   (  Updated:2025-07-22 16:11:37  IST  )

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మంగళవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పర్యవేక్షించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను పర్యవేక్షించిన సీపీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మంగళవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పర్యవేక్షించారు. రోడ్డు భద్రతలో భాగంగా, రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా సరిహద్దులోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఇందల్వాయి మండల పరిధిలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పాట్స్ ను సందర్శించారు. అక్కడ రోడ్డు ప్రమాదాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. గ్రామాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాముఖ్యతను వాహన చోదకులు గుర్తించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం మానేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్ బ్లాక్ అయ్యే ప్రదేశాల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సీఐ వినోద్ ఇందల్వాయి ఎస్ఐ సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story