ఇందల్వాయి చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీపీ

by Ratna Kumari |

బక్రీద్ పండుగ సందర్భంగా జరిగే అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇందల్వాయి చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీపీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బక్రీద్ పండుగ సందర్భంగా జరిగే అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ బోర్డర్ చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని , అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.


వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు, హెచ్చరిక లైట్లు వినియోగించడం , వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ సిబ్బందిని సీపీ ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్ట విరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ తనిఖీలలో డిచ్ ప‌ల్లి సీఐ వినోద్, ఇంద‌ల్వాయి ఎస్ఐ సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story