ఎందుకు ఓడిపోయాం? ఓటమిపై సమీక్షించుకుంటున్న అభ్యర్థులు

by Ajay Maddhiboyina |

త్వరలో రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా, అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా, పార్టీలోని కోవర్టుల పని పట్టేందుకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ఎందుకు ఓడిపోయాం? ఓటమిపై సమీక్షించుకుంటున్న అభ్యర్థులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గ్రామాల అభివృద్ధితోపాటు పట్టణ, నగర అభివృద్ధిలోప్రధాన పాత్ర పోషించే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఒకటి తర్వాత ఒకటి ముగిశాయి. ఇక మిగిలింది మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలే. గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మిగతా రాజకీయపార్టీల కన్నా అత్యధిక సంఖ్యలో స్థానాలకు గెలుచుకుని పంచాయతీలు, మున్సిపాలిటీలలో పాగా వేసి తన సత్తా చాటుకుంది. దాదాపు 70శాతానికి పైగా సీట్లను అధికార పార్టీనే గెలుచుకుందని, ప్రజలు తమ పాలనపై విశ్వాసాన్ని ప్రకటించారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పదే పదే చెపుతున్నారు. ఈనెల 16 న జరిగిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇదే ఉత్సాహంతో రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా ధీటుగా ఎదుర్కొని అత్యధిక సంఖ్యలో మండల పరిషత్ లను, వాటితో పాటు జిల్లా పరిషత్ ను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లాలో 2019లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 9స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసే దిశలో ఇప్పటి నుండే వ్యూహాలకు పార్టీ నేతలు పదును పెడుతున్నారు. పార్టీలో కొంత మంది అసంతృప్తుల కారణంగా రెబల్ గా పోటీ చేసిన వారి కారణంగా , జిల్లాలో పలు చోట్ల కచ్చితంగా గెలవాల్సిన చోట పార్టీలోని కోవర్టులు, పార్టీకి ద్రోహం చేసిన వారి కారణంగానే ఓటమి పాలైనట్లు టీపీసీసీ చీఫ్ పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడినట్లు తెలిసింది. పార్టీనాయకులు, కార్యకర్తల సమావేశంలో మహేశ్ గౌడ్ తన ఆవేధనను వెళ్లగక్కినట్లు పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు పేర్కొన్నారు.

త్వరలోనే ఈ పరిస్థితిపై కూలంకషంగా, క్షేత్రస్థాయిలో సమీక్ష జరుపనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తమ పక్కనే నమ్మకంగా ఉంటూ పార్టీకి వెన్ను పోటు పొడిచే విధంగా వ్యవహరిస్తున్న వారిలో కొందరిని ఇప్పటికే గుర్తించి జిల్లా కమిటీ నుండి టీపీసీసీ కి నివేదించారని తెలిసింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. త్వరలో రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా, అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా, పార్టీలోని కోవర్టుల పని పట్టేందుకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల కన్నా సొంత పార్టీలోని అసంతృప్తులతోనే పార్టీకి ముప్పుఉందని, కాంగ్రెస్ పోటీ చేసిన పలు స్థానాలో స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన ప్రతిచోట పార్టీ అంతర్గత కుమ్ములాట కారణంగానే విజయావకాశాలు దెబ్బతిన్నాయని అభిప్రాయం పార్టీలోని అన్ని వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలోనూ అదే పరిస్థితి..

ఈసారి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. పోటీ ఈ రెండు పార్టీల మధ్యే నువ్వా.. నేనా అన్న చందంగా పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీలాగనిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం వార్డులో కేటీఆర్ఎ నిజామాబాద్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్, బీజేపీ లు పోటీ చేసిన ప్రతి డివిజన్ లో పోటీ నువ్వా.. నేనా అన్న చందంగా నడియాయి.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలపలేదు. ఎంఐఎం కు పూర్తి స్థాయిలో పట్టున్న అభ్యర్థులను నిలబెట్టినా వృథా ప్రయాసేననే ఆలోచనతో ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న డివిజన్లలో బీజేపీ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపలేదు. కానీ, ఈసారి పలువురికి ఎంఐఎం ఇలాఖాలో బీజేపీ టికెట్లిచ్చింది. కానీ, ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు. కానీ, ముస్లీం ఇలాఖాలోనూ బీజేపీ ముస్లీం అభ్యర్థులకే టికెట్లిచ్చి గతంలో ఎన్నడూలేని కొత్త ఒరవరికి ఎంపీ అర్వింద్ ధర్మపురి శ్రీకారం చుట్టారు.

నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డిలలో తప్ప ఎక్కడా కనిపించని బీజేపీ ప్రభావం..

మొన్న జరిగిన మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలలో మినహా మరెక్కడా తన సత్తాను చూపలేకపోయింది. కార్పొరేషన్ లో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజల మద్ధతుతో నిలిచినా అధికార పీఠాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆర్మూర్ లో ప్రస్తుతం గెలిచిన సీట్లకు అదనంగా మరి కొన్ని సీట్లు గెలవాల్సిన సీట్లను కూడా గెలవలేకపోయింది. భీమ్గల్ మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ ఒక్కకౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకుని రాలేకపోయారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా, 28 డివిజన్ లో బీజేపీ గెలుపొందింది. అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తా చాటింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ ఒక దశలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందనే టాక్ వెలువడినప్పటికీ కేవలం 8సీట్లు మాత్రమే గెలిచింది. బోధన్ లోని 38 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మూడు వార్డుల్లోనే గెలిచింది. కామారెడ్డిలో కాంగ్రెస్ కు గట్టి పోటీనిచ్చి 16స్థానాలను గెలుచుకుంది. అధికార పార్టీకి ఇక్కడ 19 స్థానాలు వచ్చాయి. కామారెడ్డిలో బీజేపీ సత్తాచాటిందనే చెప్పొచ్చు. యెల్లారెడ్డి, బిచ్కుంద, భీమ్గల్ మున్సిపాలిటీలలో బీజేపీ అసలు ఖాతానే తెరవలేక పోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలతో బీజేపీ తన ప్రభావాన్నిచూపలేని మున్సిపాలిటీలతో పాటు, గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలో పార్టీ ఎందుకు వెనకబడి పోయింది.. తక్కువ సీట్లు రావడానికి కారణాలను విశ్లేషించుకునే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బీఆర్ఎస్ ప్రాభవం కోల్పోవడం వెనక..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్ సహా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ ఎందుకు వెనకబడిపో యిందనే విశ్లేషణ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెపుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు అభివృద్ధికి మద్దతు తెలిపే సంప్రదాయం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నప్పటికీ పార్టీలపై ఉన్న అపారమైన నమ్మకం, అభిమానంతోనైనా ఎక్కువ సీట్లను ఎందుకు గెలవలేక పోయిందోననే సమీక్ష త్వరలోనే జరుపుతారని తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీల వారీగా, అభ్యర్థుల వారీగా ఉన్న పలుకుబడితో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్, బీజేపీ లు చెమటోడ్చినప్పటికీ ఎవరెన్ని సీట్లు గెలవాలో గెలిచారు. రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పార్టీలో బిజీగా ఉన్నాయి. గడిచిన రెండు ఎన్నికల్లో చేసిన తప్పులను స్వీయ పరీక్ష చేసుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. అంతర్గత విభేధాలు, వ్యక్తిగత విభేధాలు అన్నీ పక్కన పెట్టి రానున్నరోజుల్లో పార్టీ అభ్యర్థులను గెలిచేలా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Next Story