- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > తెలంగాణ యూనివర్శిటీలో మళ్లీ లొల్లి.. వీసీ టేబుల్ పైకేక్కి విద్యార్థి సంఘ నేతల హల్ చల్!
తెలంగాణ యూనివర్శిటీలో మళ్లీ లొల్లి.. వీసీ టేబుల్ పైకేక్కి విద్యార్థి సంఘ నేతల హల్ చల్!
by Satheesh |
నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్శిటీలో రిజిస్ట్రార్ ఎంపికపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్శిటీలో రిజిస్ట్రార్ ఎంపికపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారులు అధిపత్య పోరు కోసం ఒకే యూనివర్శిటీకి ఇద్దరు రిజిస్ట్రార్లను నియామించారు. యూనివర్శిటీ పాలకమండలి ఒక వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియమించగా.. వీసీ మరో వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియమించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తుల్లో అసలైన రిజిస్ట్రార్ ఎవరో అర్థం కాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా.. వీసీ తీరుపై విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థి సంఘ నేతలు వీసీ చాంబర్‌లో హల్ చల్ చేశారు. ఏకంగా వీసీ కార్యాలయంలోకి వెళ్లిన విద్యార్థి సంఘ నేతలు వీసీ టేబుల్ పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. అధికారుల తీరుతో తమ చదువుకు ఆటంకం కలుగుతోందని యూనివర్శిటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






