భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ఇదే

by velandi.Saikiran |

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగులు, ఇతర జలాశయాల

భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ఇదే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగులు, ఇతర జలాశయాల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. భారీ వర్షాల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలలో చిక్కుకునేందుకు ఆస్కారం ఉన్నందున అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని హితవు పలికారు. చేపల వేట, సరదా కోసం ఈతకు వెళ్లకూడదని సూచించారు.

ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, తక్షణ పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలు అవసరమైన పక్షంలో కలెక్టరేట్ లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462 - 220183 కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు.

Next Story