- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలోనే ఫస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణం
ఆలూర్ మండల కేంద్రంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం లక్ష్యంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ జిల్లాలోనే తొలిసారిగా ఆలూర్ గ్రామపంచాయతీలో ఈ తరహా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహణ రికార్డులు, పన్నుల వసూళ్ల రిజిస్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణ పత్రాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను డీపీవో పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని, చెత్తను తడి–పొడి విధానంలో వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ గ్రామాల కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర విజయ్, ఎంపీడీవో గంగాధర్, డీఎల్పీఓ శివకృష్ణ, ఎంపీవో రఘురామ్, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, ఉప సర్పంచ్ మోహన్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రవీణ్ రంజిత్, సాయిలు పాల్గొన్నారు.






