అధికారుల సంతకాల ఫోర్జరీ.. కానిస్టేబుల్‌ సస్పెండ్

by Bhanu |   (  Updated:2025-06-23 12:38:13  IST  )

ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

అధికారుల సంతకాల ఫోర్జరీ.. కానిస్టేబుల్‌  సస్పెండ్
X

దిశ, కామారెడ్డి : ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కాలంలో కానిస్టేబుల్ కె. రవికుమార్ బస్ వారంట్లు, ఏఎస్‌ఐ సంతకాలను నకిలీ చేయడంతో పాటు వాటిని దుర్వినియోగం చేశాడు. అంతేగాక, విధులకు గైర్హాజరై ఉన్నప్పటికీ పై అధికారుల పేరుతో తప్పుడు నివేదికలు పంపించినట్టు ఆరోపణలున్నాయి.

ఈ వ్యవహారంపై బాన్సువాడ డీఎస్పీ సమర్పించిన నివేదికను పరిశీలించిన ఎస్పీ, ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రవికుమార్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు అయినా, ఏ ఇతర ఉద్యోగులు అయినా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినా లేదా చట్ట విరుద్ధంగా వ్యవహరించినా కఠినమైన శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Next Story