కానిస్టేబుల్ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్

by Bhanu |   (  Updated:2025-05-01 13:43:02  IST  )

నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి జిల్లా కోర్టునందు విధులు నిర్వహిస్తున్న గజానంద్ జాదవ్ అనే కానిస్టేబుల్ (నెం. 1922 ) ను పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కానిస్టేబుల్  సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి జిల్లా కోర్టునందు విధులు నిర్వహిస్తున్న గజానంద్ జాదవ్ అనే కానిస్టేబుల్ (నెం. 1922 ) ను పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టులో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్ తాత్కాలిక ప్రాపర్టీ రిలీజ్ కేసులలో పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించడంతోపాటు, మరిన్ని వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టుగా గజానంద్ జాదవ్ పై ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

గజానంద్ జాదవ్ పలు ప్రయివేటు చీటీల యాజమాన్యం సహకారంతో కలిసి 4 నుండి 5 చీటీలు వేసి మోసపూరితంగా తన తోటి సిబ్బందిని, మిత్రులను గ్యారంటీయర్లుగా పెట్టి చీటీలకు సంబంధించిన డబ్బులు లేపుకున్నాడు. చీటీ డబ్బులు క్రమం తప్పకుండా కట్టాల్సిఉన్నా కట్టకపోగా, తన ఎత్తుకున్న చీటీలకు తనకు ఏం సంబంధం లేనట్లుగా రికవరీలు కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో తన మిత్రులకు, తోటి సిబ్బందికి మాత్రమే మోసపూరితంగా రివకవరీలు అయ్యే విధంగా చేసినందుకు బాధితులు నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదైంది. ఈ విషయం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పోతరాజు సాయి చైతన్య దృష్టికి రావడంతో క్రమ శిక్షణ చర్యల్లో కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారని కమీషన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసు శాఖలో పనిచేస్తూ క్రమశిక్షణతో మెలగాల్సిన సిబ్బంది క్రమశిక్షణా రాహిత్యంగా, ఇతరులను మోసం విధంగా వ్యవహరించే చర్యలను సహించేది లేదని కమిషనర్ సాయిచైతన్య సీరియస్ గా హెచ్చరించారు. .


Next Story