ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూల్ చేసిన కానిస్టేబుల్

by Bhanu |

నిజాంబాద్ జిల్లా, రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిద్దిరాం చిన్నయ ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను శుక్రవారం సీ.పీ. సాయి చైతన్య సస్పెండ్ చేశారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూల్ చేసిన కానిస్టేబుల్
X

దిశ: బాన్సువాడ : నిజాంబాద్ జిల్లా, రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిద్దిరాం చిన్నయ ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను శుక్రవారం సీ.పీ. సాయి చైతన్య సస్పెండ్ చేశారు.ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిర్మల్ జిల్లా తెంభూర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం నుంచి కానిస్టేబుల్​ కొన్ని నెలల క్రితం రూ.2 రెండు లక్షలు వసూలు చేశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై నిజామాబాద్ 1టౌన్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఇలా నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో చాలామంది వద్ద రూ.లక్షలు వసూలు చేయడంతో పాటు ఆ డబ్బులు అధిక వడ్డీకి ఇతరులకు ఇచ్చినట్లు తేలింది. విచారణ చేపట్టిన అనంతరం చట్టపరమైన చర్యల్లో భాగంగా కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ సీ.పీ. ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి చర్యలకు సహించేది లేదని. ప్రజలు ఇలాంటి మోసగాల్ల ఎడల జాగ్రత్తగా ఉండి మోసపోకూడదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.



Next Story