- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధారి మండలంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన జోడో యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు నాయకులు కార్యకర్తలు గుడిబెట్ నుంచి కాలినడకన వచ్చి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ సభాస్థలికి చేరుకుంటున్నారు.

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన జోడో యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు నాయకులు కార్యకర్తలు గుడిబెట్ నుంచి కాలినడకన వచ్చి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ సభాస్థలికి చేరుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎల్లారెడ్డి అసెంబ్లీ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉదయం 9 గంటల నుంచి గాంధారి మండలం మాధవ పల్లి గేట్ నుంచి మొదలవుతుంది.
అక్కడి నుండి గాంధారి మండలంకు చేరుకొని మండలంలోని శివాజీ చౌక్ వద్ద "నిరుద్యోగ నిరసన దీక్ష" కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రేవంత్ రెడ్డి అక్కడే దీక్ష చేస్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావాలని పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయంను ప్రజలందరూ గుర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు.






