స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించేలా ప‌ని చేయాలి : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

by Ratna Kumari |

దిశ‌, ధ‌ర్ప‌ల్లి : స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కింది స్థాయిలో చక్కగా పని చేసే పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేలా కృషి చేయాలని నిజామాబాద్

స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించేలా ప‌ని చేయాలి : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
X

దిశ‌, ధ‌ర్ప‌ల్లి : స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కింది స్థాయిలో చక్కగా పని చేసే పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేలా కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధర్పల్లి పాత గురడి రెడ్డి సంఘం లో సిరికొండ ఇందల్వాయి ధర్పల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమావేశం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రైతులు గరీబులో మైనార్టీల అందరి కోసం కాంగ్రెస్ పని చేస్తుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన కోరారు. బిజెపి ధనవంతుల పార్టీ అని.. ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పథకాలు ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రజలకు విషయం చేరువ అయ్యేలా కింది స్థాయిలో కార్యకర్తలు, నాయకులు పని చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అది మీ పైనే ఉందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికకు పలువురు పోటీ పడడంతో సంఘటన్ శ్రీజన్ అభియాన్ పేరా కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా పరిశీలకునిగా రిజ్వాన్ హర్షద్ ఆధ్వర్యంలో మరో ముగ్గురు సహాయ కులతో కలిసి హాజరై రహస్యంగా అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నాయకులు మేము చక్కగా పార్టీకి సేవలు చేస్తు పార్టీ అభివృద్ధికి పని చేస్తామని డీసీసీ అధ్యక్షుని పోటీలో ఉన్న నాయకులు ఎవరికి వారే మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ముందు ప్రచారం చేసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, గుట్ట గంగాధర్, లింగాపూర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story