సోమార్ పేట ఘ‌ట‌న పై కాంగ్రెస్ ఉక్కుపాదం

by Nallavelli.Anjaneyulu |

దిశ, తాడ్వాయి(ఎల్లారెడ్డి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్ పేట‌ లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటన పై కాంగ్రె

సోమార్ పేట ఘ‌ట‌న పై కాంగ్రెస్ ఉక్కుపాదం
X

దిశ, తాడ్వాయి(ఎల్లారెడ్డి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్ పేట‌ లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటన పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పార్టీ నాయకత్వం, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ నుంచి కురుమ సాయిబాబా ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ​ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన తన ప్రకటనలో సోమార్ పేట ఘటనలో దోషులు ఎవరైనా సరే,వారు ఏ స్థాయిలో ఉన్నా సరే చట్టం ముందు తప్పించుకునే అవకాశం లేదు. వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను సహించేది లేదని,అందుకే తక్షణమే మండల అధ్యక్షుడిపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ నిర్ణయం ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీకి చెందిన కీలక నేతపైనే అధిష్టానం వేటు వేయడం ద్వారా, అరాచకానికి పాల్పడే వారి విషయంలో పార్టీ ఎంత కఠినంగా ఉంటుందోననే సంకేతాలను పంపినట్లయింది. ​ఈ నిర్ణయంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చ మొదలైంది. తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే పంపిన ఈ సందేశం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story