డీఎస్పీ ఉద్యోగం సాధించిన రోజా బాయి కి స‌న్మానం

by Ratna Kumari |

దిశ‌, నిజాంసాగ‌ర్ : కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని గిర్ని తండాకు చెందిన కడావత్ రోజా భాయి అనే మహిళ డీఎస్పీ ఉద్యోగం సాధించింది. అయితే

డీఎస్పీ ఉద్యోగం సాధించిన రోజా బాయి కి స‌న్మానం
X

దిశ‌, నిజాంసాగ‌ర్ : కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని గిర్ని తండాకు చెందిన కడావత్ రోజా భాయి అనే మహిళ డీఎస్పీ ఉద్యోగం సాధించింది. అయితే మంగళవారం విజయ్–రోజా భాయి దంపతులను తండా వాసులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో కడావత్ రోజా బాయి ఉత్తమ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపిక‌య్యారు. ఈ సందర్భంగా రోజా బాయిని గిర్నీ తాండ ప్రజలతోపాటు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. తండాకు చెందిన రోజా భాయి చదువుల్లో కష్టపడి విజయం సాధించినందుకు తాండాతోపాటు మండలానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రాథోడ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కిషన్ రాథోడ్, శత్రు, షేక్ గౌస్, చందర్, ఏం సుందర్, హరి సింగ్, సక్రు పాల్గొన్నారు.

Next Story