కులం పేరుతో దూషించిన కుటుంబ స‌భ్యుపై ఫిర్యాదు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించిన మహిళ కుటుంబ సభ్యులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

కులం పేరుతో దూషించిన కుటుంబ స‌భ్యుపై ఫిర్యాదు
X

దిశ‌, బాన్సువాడ : అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించిన మహిళ కుటుంబ సభ్యులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాన్సువాడ డీఎస్పీ కు బాధితులు ఫిర్యాదు చేశారు. బీర్కూరు మండలం, కిష్టాపూర్ గ్రామానికి చెందిన దండు గంగధర్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ గా ఉన్నాడు. గ్రామానికి చెందిన పోతుగంటి సాయవ్వ భర్త గంగారం ఏడవ వార్డు కౌంటింగ్ విషయంలో ఇద్దరికీ 93 ఓట్లు వ‌చ్చాయి. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడం తో పోలింగ్ బూత్ అధికారుల సమక్షంలో డ్రా పద్ధతిలో సొమ్ము పద్మ విజయం సాధించారు. ఈ విషయంలో పోలింగ్ ముగిసిన అనంతరం ఏజెంట్ గా వివరించిన గంగాధర్ ని అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తూ చరవాణిలో రికార్డ్ చేసి సెల్ఫోన్ కు పంపించడం గ్రూపుల్లో పంపడంతో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. పోతుగంటి సాయవ్వ తోపాటు కుటుంబ సభ్యుల తో పాటు ఇద్దరు కుమారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,మాల కులస్తుడైన నాకు అవమానించే రీతిలో ఈ విధంగా పరుష అసభ్య పదజాలంతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో గంగాధర్ పేర్కొన్నారు.

Next Story