రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనను కప్పిపుచ్చు కోనేందుకే కేంద్రంపై నిందలు: ఎమ్మెల్యే

by Kodari Anjali |

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనను కప్పిపుచ్చు కోనేందుకే కేంద్రంపై నిందలు: ఎమ్మెల్యే
X

దిశ, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ ఆర్ ఎఫ్ సి డ్రామా మొదలుపెట్టిండనీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని, దానిని ఏమీ చేయలేక కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రవేట్ సంస్థ తెచ్చుకున్న వాణిజ్య రుణాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ నిధులు ఇస్తుందని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారో ఏ ఆర్థిక శాస్త్రంలో చదివాడు తెలుపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. భూసేకరణ రాష్ట్ర వాటా చూపించే సత్తా లేని అసమర్థత ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

వారికి ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు..

ఎన్నికల్లో 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో పేజ్ 2 కడతామని చెప్పి అబద్ధాల హామీలతో గద్దెనెక్కి చేతులు దులుపుతున్నాడని, మెట్రో తొలిదశలో మోడీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, కేసీఆర్ పాపాల వల్ల మెట్రో నష్టపోతే దాన్ని బాగు చేయాల్సింది పోయి పక్క రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఏడుస్తున్నాడని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులతో లోపాయికర ఒప్పందం ఉంది అని రేవంత్ రెడ్డి మాట్లాడడం దిగజారుడు రాజకీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని, జర్నలిస్టులను కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నాడని, వారికి ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇవ్వక వారిని ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇకనైనా మారి జర్నలిస్టులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు.

సమన్వయం లేకుండా రైతులను నానావస్థలు..

నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం నోటి మాటలకే పరిమితమై, నిరుద్యోగ భృతి ఇవ్వక, జాబ్ నోటిఫికేషన్ వెయ్యక, యువతతో ఆటలాడుతున్నాడని సరైన సమయం కోసం యువత వేచి చూస్తుందని, అలాగే రైతుల విషయంలో కూడా రుణమాఫీ కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కానీ సరైన పద్ధతి లేకుండా కార్యాచరణ చేయకుండా అధికారులకు సమన్వయం లేకుండా రైతులను నానావస్థలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పులతో కొట్టే రోజు వచ్చిందని ఎవరికి వారు ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దొంగల చేతిలో పెట్టినట్టు భావిస్తున్నారని రాష్ట్ర మంత్రులు నిధుల విషయంలో పొంతన లేని సమాధానం చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిన విషయంలో బహిరంగ చర్చకు రాష్ట్ర ప్రభుత్వంతో సిద్ధమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు ఇచ్చిన వాటిని వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైపల్యం చెందిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Next Story