కారు, బైకు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 1 |
కారు, బైకు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ : నాగిరెడ్డిపేట్ : కారు, బైక్ ఢీకొనగా ఓ వ్యక్తి తీవ్ర గాయలపాలైన ఘటన నాగిరెడ్డిపేట మండలంలోని బంజర తాండ గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద కొడప్ గల్ మండలంలోని బేగంపూర్ గ్రామానికి చెందిన పెండ్యాల విజయ్ కుమార్ తన బాబాయి కూతురు పెళ్లి మెదక్ జిల్లా రామయంపేట్ పట్టణంలో జరుగుతోంది. వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా గ్రామ సమీపంలో ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెండ్యాల విజయ్ కుమార్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కారు డ్రైవర్ అంజయ్యపై చర్యలు తీసుకోవాలని పెండ్యాల విజయ్ కుమార్ అన్న సుధీర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed