- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండలంలో కలెక్టర్ పర్యటన
దిశ, గాంధారి : మండలంలోని వండ్రికల్ గ్రామంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటించారు.

దిశ, గాంధారి : మండలంలోని వండ్రికల్ గ్రామంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించి, గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు.
ఎరువుల దుకాణాల తనిఖీ..
మండల కేంద్రంలో గల మౌనిక ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వలను పరిశీలించారు, యూరియా నిల్వలు స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేయాలని దుకాణం యజమానికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, గ్రామీణాభివృద్ధి శాఖ పిడి సురేందర్, హౌసింగ్ పిడి సుభాష్, ఎల్లారెడ్డి డి.ఎల్.పి.ఓ. సురేందర్, ఎల్లారెడ్డి ఎ.డి.ఎ. సుధా మాధురి, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపిడిఓ రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీ నారాయణ, ఏఈ దామోదర్, వండ్రికల్ గ్రామ సర్పంచ్ చందన పాల్గొన్నారు.






