వ‌ర్షం ప్ర‌భావంతో రైతులు వ‌రికోత‌లపై జాగ్ర‌త్త‌లు పాటించాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, స‌దాశివ‌న‌గ‌ర్ : స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌ల కేంద్రంతో పాటు రామారెడ్డి మండలం లోని ఉప్పల్ వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్

వ‌ర్షం ప్ర‌భావంతో రైతులు వ‌రికోత‌లపై జాగ్ర‌త్త‌లు  పాటించాలి
X

దిశ‌, స‌దాశివ‌న‌గ‌ర్ : స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌ల కేంద్రంతో పాటు రామారెడ్డి మండలం లోని ఉప్పల్ వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ శాఖ సూచనల మేరకు తుఫాను ప్రభావం వల్ల‌ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అన్నీ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలనీ సూచించారు. రైతులు నష్టపోకుండా, ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో వర్ష ప్రభావంతో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రాల వద్ద వడ్ల కాంటాలను పరిశీలించి, వాతావరణం బాగా లేనందున కాంటా వేసిన బస్తాలు సంరక్షించుకోవాలని సెంటర్ ఇన్ చార్జీకి, సంఘ కార్యదర్శికి సూచించారు. అదేవిధంగా రైస్ మిల్లు వద్ద వడ్ల సంచులు దించుకున్న వెంటనే, రిసిప్ట్ పొంది వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 427 కేంద్రాలు, 233 ఫాక్స్ కేంద్రాలు, 193 ఐకెపి ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట డిప్యూటి కలెక్టర్ రవితేజ, డీ ఆర్వో మదన్ మోహన్, డీసీవో రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్ ఉన్నారు.

Next Story