ఆర్టీవో చెక్ పోస్టుల మూసివేత

by Ratna Kumari |   (  Updated:2025-10-22 10:49:06  IST  )

దిశ‌, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఇవాళ‌ రెండు ఆర్టీవో చెక్ పోస్టుల‌ను మూసివేశారు. జిల్లాలోని మ‌ద్నూర్ మండ‌ల సలాబ‌త్పూర్, భిక్క‌నూరు మండ‌లం పొందుర్తి వ‌ద్ద

ఆర్టీవో చెక్ పోస్టుల మూసివేత
X

దిశ‌, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఇవాళ‌ రెండు ఆర్టీవో చెక్ పోస్టుల‌ను మూసివేశారు. జిల్లాలోని మ‌ద్నూర్ మండ‌ల సలాబ‌త్పూర్, భిక్క‌నూరు మండ‌లం పొందుర్తి వ‌ద్ద ఆర్టీవో చెక్ పోస్టును బుధ‌వారం నుంచి మూసీ వేస్తున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ చెక్ పోస్టుల‌ను బుధవారం నుంచే మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి స్వయంగా చెక్ పోస్టులను తొలగించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆర్టివో సేవల కోసం వాహనదారులు https://tgtransport.net/tgcfstonline/ సంప్రదించాలని సూచించారు.

Next Story