- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటర్ ట్యాంక్ ఎక్కి.. రైతు హల్ చల్
కూల్చి వేయించిన పశువుల తాగునీటి తొట్టెను తిరిగి నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు చెప్పినందుకు ఆగ్రహంతో ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి... అక్కడే గడ్డి

దిశ, భిక్కనూరు : కూల్చి వేయించిన పశువుల తాగునీటి తొట్టెను తిరిగి నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు చెప్పినందుకు ఆగ్రహంతో ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి... అక్కడే గడ్డి గుళికలు మింగి ఘాతుకానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భి క్కనూరు మండలం గుర్జగుంట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గుర్జగుంట గ్రామానికి చెందిన కుంట ప్రభాకర్ రెడ్డి అనే రైతు తన ప్లాట్ లో ఇటీవలే ఇల్లు నిర్మించుకున్నాడు. ప్లాటు కొనుగోలుకు ముందే అక్కడ గత 40 సంవత్సరాల క్రితం గ్రామంలోని పశువుల తాగునీటి కోసం నీటి తొట్టెను నిర్మించారు. ఆ ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉందని జేసీబీ సహాయంతో ఇటీవలే కూల్చివేయించాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో రైతు ప్రభాకర్ రెడ్డి తో గ్రామస్తులు మాట్లాడి తిరిగి తాగునీటి తొట్టిని నిర్మించి ఇవ్వాలని సూచించారు. అందుకు ఆ రైతు అంగీకరించినప్పటికీ, అకస్మాత్తుగా ఇవాళ తన ఇంటి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి చచ్చిపోతున్నానంటూ హల్ చల్ చేశాడు.
అప్పటికే అరగంటకు పైగా సమయం దాటిపోవడం ఎంత బ్రతిమాలిన కిందికి దిగిరాకుండా అక్కడే భీష్మించుకుని కూర్చున్నాడు. ఏదైనా ఉంటే కిందికి దిగొస్తే కూర్చొని మాట్లాడుకుందామని గ్రామస్తులంతా ఎంత నచ్చ జెప్పినా వినిపించుకోకుండా తన వెంట తీసుకెళ్లిన గడ్డిమందు గుళికలను నోట్లో పోసుకున్నాడు. వెంటనే గ్రామస్తులు కొందరు పైకెక్కి, గుళికల గడ్డి మందు పాకెట్ ను పక్కకు గుంజేసి, నోట్లో పోసుకున్న గడ్డి మందు గుళికలను ట్యాంక్ పైనే కక్కించడం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం అంటూ గ్రామస్తులు నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేసినప్పటికీ, ఒప్పుకోకపోగా హంగామా చేశాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్ ఐ ఆంజనేయులు కూడా కిందికి దిగి వస్తే వారితో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడంతో అప్పుడు బాధిత రైతు శాంతించి పైకెక్కిన గ్రామస్తులతో కలసి కిందికి దిగి వచ్చాడు. దీంతో దాదాపు ముప్పావు గంట ఉత్కంఠకు తెర పడింది. అతడిని వెంటనే వైద్య పరీక్షల కోసం వాహనంలో ఎక్కించి కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.






