- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యర్థాలు రోడ్లపై వేయొద్దు: కౌన్సిలర్ హర్షిత
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయొద్దని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దిశ, కామారెడ్డిటౌన్: వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయొద్దని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, పాత ఎన్‌హెచ్ హైవే పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ చెత్త బండిలోనే వేయాలని, పర్యావరణ కాలుష్యం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని, వర్షాకాలంలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ రాంమోహన్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్. సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఆర్‌కే డిగ్రీ కళాశాల సీఈఓ జైపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పడిగేల రాజేశ్వర్ రావు, ప్రొఫెసర్ నాగరాజు, రాజనర్సింహారెడ్డి, మడిపెద్ది వెంకట్, మహేందర్, గంజి సతీష్ గుప్తా, ఐకేపీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






