ఆర్మూర్ కాంగ్రెస్ లో కుమ్ములాట‌లు..!

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మున్సిపల్ పట్టణ కేంద్రమైన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు లుకలుకలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను చూస్తే ఇట్టే అర్థమవుతున్నట్లు ఆర్మూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఆర్మూర్ కాంగ్రెస్ లో కుమ్ములాట‌లు..!
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మున్సిపల్ పట్టణ కేంద్రమైన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు లుకలుకలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను చూస్తే ఇట్టే అర్థమవుతున్నట్లు ఆర్మూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉన్నట్టా..? లేనట్టా..? అని ఇటీవల మొన్న జరిగిన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి పిలుపు లేదు అనే విషయంపై ఆర్మూర్ లోని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఆర్మూర్ కాంగ్రెస్ పట్టణ బాధ్యుడు కనీసం గ్రూపులో ఒక మెసేజ్ పెడితే అయిపోయేది. అలాగే బాసరలో అభివృద్ధి పనులకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి వ‌చ్చిన సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు ఎవ్వ‌రికీ పిలుపు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సీఎం రేవంత్ రెడ్డి వ‌చ్చిన సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీలోని ఎవ్వ‌రికీ పిలుపు లేదు అంటూ కూడిన వివ‌రాల‌తో పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎవ్వ‌రికీ వారే య‌మునా తీరే అనే విధంగా త‌యారైంది అని.. కింది స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వారి బాధ‌లు ఎవ్వ‌రికీ చెప్పుకోవాలి అంటూ ఆర్మూర్ పార్టీ కాంగ్రెస్ బీసీ నాయకులు ర‌మ‌ణ ఆర్మూర్ ప‌ట్ట‌ణ ప్రాంతంలో కాంగ్రెస్ నాయ‌కుల కార్య‌క‌ర్త‌ల గోడును వినే నాధుడే లేకుండా పోయింది అని వాపోయారు. దీంతో ఆర్మూర్ కాంగ్రెస్ లోని మున్సిప‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలో గ్రూపు త‌గాదాల‌తో ఒక వ‌ర్గం నాయ‌కత్వం పై అధిష్టానానికి మ‌రో వ‌ర్గం నాయ‌కులు ఫిర్యాదు చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభ‌మైన అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఏ మేర‌కు నిలువ‌రించి ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల్లోకి ఏ త‌ర‌హాలో తీసుకువెళ్తుందో చూడాల్సిందే.

Next Story