వారాంతపు సంతలో ఘర్షణ

by Ratna Kumari |

మండలం లోని గజ్యానాయక్ తండా లో ప్రతి మంగళవారం జరిగే వారాంతపు సంత లో తైబజార్ రుసుం పెంపు వివాదం ఘర్షణకు దారి తీసింది.

వారాంతపు సంతలో  ఘర్షణ
X

దిశ, మాచారెడ్డి : మండలం లోని గజ్యానాయక్ తండా లో ప్రతి మంగళవారం జరిగే వారాంతపు సంత లో తైబజార్ రుసుం పెంపు వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో వ్యాపారుడికి తైబజార్ గుత్తేదారు అనుచరుల పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గజ్యా నాయక్ తాండలో మంగళవారం సంత తైబజార్ గుత్తేదారు అధిక రుసుం వసూలు చేస్తుండడంతో ఇది పద్ధతి కాదని అజీజ్ అనే వ్యాపారస్తుడి పై పది మంది రౌడీల్లా వచ్చి దాడికి దిగారు. ఈ దాడి ని ఆపే ప్రయత్నం చేసిన వ్యాపారస్తులపై దాడి చేయ‌డంతో వారికి గాయాల‌య్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిస్తున్నా వ్యాపారాస్తులను మీ అంతు చూస్తా నిన్ను చంపేస్తా అని బెదిరింపు లకు దిగారు. తనకు తైబజార్ గుత్తేదారు అతని అనుచరులతో ప్రాణ భయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Next Story