చిరుత పులి సంచారం కలకలం..భయాందోళనలో ప్రజలు

by Ratna Kumari |

మండల పరిధిలోని బషీరాబాద్ కాడి చెరువు నుంచి కోనసముందర్, మెండోరా శివారు ప్రాంతాలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

చిరుత పులి సంచారం కలకలం..భయాందోళనలో ప్రజలు
X

దిశ, కమ్మర్‌ పల్లి : మండల పరిధిలోని బషీరాబాద్ కాడి చెరువు నుంచి కోనసముందర్, మెండోరా శివారు ప్రాంతాలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ ప్రాంత అడవుల్లో పశువులను మేపుతుండగా చిరుత పులి అకస్మాత్తుగా దాడి చేసి మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్లి తింటున్న ఘటనలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల మేకలు, గొర్రెల కాపరులు తెలిపారు. చిరుత సంచారం వల్ల పశువుల మేతకు వెళ్లాలంటేనే కాపరులు వెనుకడుగు వేస్తున్నారు. చిరుత పులి సంచారంపై ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు స్పందించి అటువైపు ఎవరు వెళ్లొద్దంటూ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు వారి బృందంతో అటవీశాఖ అధికారులు ఉదయం నుంచి పర్యవేక్షణ గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ చిరుత అనవాళ్లు పాదాల ముద్రలు లేవని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దని, వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story