అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చతుర్దశి వేడుకలు

by velandi.Saikiran |

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చతుర్దశి వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. భిక్కనూరు మండల కేంద్రంలోని

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చతుర్దశి వేడుకలు
X

దిశ, భిక్కనూరు : అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చతుర్దశి వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. భిక్కనూరు మండల కేంద్రంలోని పోస్టాఫీస్ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో చతుర్దశి వేడుకలకు నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి, పెద్ద ఎత్తున భ‌క్తులు తరలివచ్చి,అనంత కోటి వత్తులు ముట్టించుకోనున్నారు.

ఆలయ అర్చకులు పెద్దెడ్ల వెంకటేశ్వర శర్మ, కుమారుడు జయప్రకాష్ శర్మ మంత్రో చరణాల మధ్య స్వామివారికి వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం వచ్చిన మహిళలు స్వామివారికి అనంత కోటి వత్తులు వెలిగించి మొక్కులు చెల్లించుకోనున్నారు. చతుర్దశి వేడుకలను పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దైవ దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story