రోడ్డు ప్రమాదం.. చ‌ల్మెడ యువ‌కుడు మృతి

by Ratna Kumari |

నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన యువకుడు సంగేపు శేఖర్ (28 ) కామారెడ్డి జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం.. చ‌ల్మెడ యువ‌కుడు మృతి
X

దిశ, నిజాంపేట : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన యువకుడు సంగేపు శేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. శేఖర్ బిక్కనూరు లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నారు. ఇంటికి వస్తున్న క్రమంలో అతివేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రజిత, కుమారుడు ఉన్నారు.

Next Story