- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికార లాంఛనాలతో సీసీఎస్ కానిస్టేబుల్ అంత్యక్రియలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నేరస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను శనివారం పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది,

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నేరస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను శనివారం పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది, మృతుడి కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో అధికార లాంఛనాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయిచైతన్య మృతుడికి నివాళులర్పించారు. దోపిడీ దొంగతనాలు, హత్య సంబంధిత నేరాలతో సంబంధమున్న పాత నేరస్థుడు రియాజ్ ను సీసీఎస్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో కానిస్టేబుల్ ప్రమోద్ పై నిందితుడు రియాజ్ కత్తితో విచక్షణారహితంగా దాడి జరపడంతో కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన యావత్ పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం పోలీసు శాఖ అధికారిక లాంఛనాలతో ప్రమోద్ అంత్యక్రియలను నిర్వహించింది. అంతకు ముందు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కంఠేశ్వర్ లోని న్యూ బ్యాంక్ కాలనీలో ఉన్న మృతుడు ఇంటికి వెళ్లి ప్రమోద్ మృత దేహం పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో పోలీసు శాఖ అన్ని విధాల బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసాను కల్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రమోద్ పాడెను సీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీసీ (లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డిలు పాడె మోశారు. అంత్యక్రియల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సంక్షేమసంఘం ప్రతినిధులు, స్థానికులు పెద్దయెత్తున అశ్రునయనాలతో సీసీఎస్ కానిస్టేబుల్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.






