కారు ద్విచక్ర వాహనం ఢీ.. వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-04 11:27:01  IST  )

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ మండలం, కొయ్యగుట్ట తండా వద్ద కారు, ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీ కొనడం తో కేతావత్ వసురం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య బూరీ బాయి కి తీవ్ర గాయాలయ్యాయి.

కారు ద్విచక్ర వాహనం ఢీ.. వ్యక్తి మృతి
X

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ మండలం, కొయ్యగుట్ట తండా వద్ద కారు, ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీ కొనడం తో కేతావత్ వసురం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య బూరీ బాయి కి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు సంగారెడ్డి జిల్లా నాగాధార మండలం ఘర్ కు చట్టు తండా వాసి గ పోలీసులు గుర్తించారు. నాగధార నుంచి కామారెడ్డి జిల్లా కోనాపూర్ గ్రామం బంధువుల కలవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.హెచ్.ఓ. తుల శ్రీధర్ తెలిపారు.

Next Story