- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బైక్ ఢీ.. ఒకరికి గాయాలు
దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని హెచ్ పీ పెట్రోల్ పంపు వద్ద శుక్రవారం కారు బైక్ ఢీకొని

X
దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని హెచ్ పీ పెట్రోల్ పంపు వద్ద శుక్రవారం కారు బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన బైండ్ల భూమన్న అనే వ్యక్తి హెచ్.పీ పెట్రోల్ పంపులో తన బైక్ లో పెట్రోల్ పోయించుకుని రోడ్డు దాటుతుండగా.. కమ్మర్ పల్లి నుండి మోర్తాడ్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు అతివేగంగా బైకును ఢీ కొట్టడంతో బైక్ పైన ఉన్న భూమన్న ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని 108 అంబులెన్సులో నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






