నారాయణపేట లో గంజాయి విక్రయాలు...?

by Naveena |

కర్ణాటక చెందిన ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో సుమారు చాలా కాలం నుంచి గంజాయి విక్రయిస్తుండగా నారాయణ పేట ఎక్సైజ్ పోలీసులు ఎట్టకేలకు గుర్తించి గంజాయి విక్రేతను పట్టుకున్నారు.

నారాయణపేట లో గంజాయి విక్రయాలు...?
X

దిశ, నారాయణపేట క్రైమ్: కర్ణాటక చెందిన ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో సుమారు చాలా కాలం నుంచి గంజాయి విక్రయిస్తుండగా నారాయణ పేట ఎక్సైజ్ పోలీసులు ఎట్టకేలకు గుర్తించి గంజాయి విక్రేతను పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో యువతకు గంజాయి విక్రయించాడని సమాచారం. యువత కూడా గంజాయి చాలా రోజుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తెచ్చి ఎవరెవరికి విక్రయించాడు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో జిల్లా కేంద్రానికి చెందిన ఎంతమంది యువత బానిసలుగా ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story