బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య

by Naveena |

బీఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ చేరికలు మొదలయ్యాయి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాజకీయాలకు మళ్లీ పదును పెడుతున్నారు. మళ్లీ పార్టీలోకి చేరికల వైపు దృష్టి సారించి ప్రోత్సహిస్తున్నారు.

బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య
X

దిశ, భీమ్గల్ : బీఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ చేరికలు మొదలయ్యాయి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాజకీయాలకు మళ్లీ పదును పెడుతున్నారు. మళ్లీ పార్టీలోకి చేరికల వైపు దృష్టి సారించి ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా భీమ్గల్ పట్టణానికి చెందిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నర్సయ్యను పార్టీలోకి చేర్చుకున్నారు. సోమవారం నర్సయ్య బీఎస్పీ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుని గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. నర్సయ్యతో పాటు బీఎస్పీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ సహా వారి అనుచరులు కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. భీంగల్ మున్సిపల్ తాజా మాజి కౌన్సిలర్ బోర్ల లింగం, సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తండా సర్పంచి రమేశ్ లతో పాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు తక్కూరి రంజిత్ తో పాటు పలువురు కూడా కాంగ్రెస్ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Next Story