న‌వీపేట మ‌హిళా దారుణ హ‌త్య‌.. రంగంలోకి స్పెష‌ల్ టీమ్

by Ratna Kumari |   (  Updated:2025-11-01 16:41:20  IST  )

దిశ ప్ర‌తినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య కేసులో పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య సీరియస్ గా స్పందించారు. అతి కిరాతకంగా మహిళను

న‌వీపేట మ‌హిళా దారుణ హ‌త్య‌.. రంగంలోకి స్పెష‌ల్ టీమ్
X

దిశ ప్ర‌తినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య కేసులో పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య సీరియస్ గా స్పందించారు. అతి కిరాతకంగా మహిళను హత్య చేసిన దుండగులు, మహిళ మృత దేహాన్ని వివస్త్రగా చేసి పడేశారు. సంఘటన స్థలంలో శరీరం నుండి తలను వేరు చేశారు. మొండెం మాత్రమే ఘటనా స్థలంలో కనిపించింది. మృత దేహంలోని తల, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా ఘటనా స్థలంలో మృతదేహం కనిపించడంతో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. 20 నుంచి 40 ఏళ్ల‌ వయసున్న మహిళ మృత దేహం దారుణమైన స్థితిలో పడి ఉండటాన్ని సీపీ సాయిచైతన్య కూడా ఘటనా స్థలానికి వచ్చి స్వయంగా పరిశీలించారు. ఈ కేసు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీపీ కేసు దర్యాప్తుకు హుటా హుటిన 10 స్పెషల్ బృందాలను రంగంలోకి దింపారు. ఈ సందర్బంగా డాగ్ స్క్యార్‌డ్ , క్లూస్ టీం సిబ్బంది క్లూస్ కోసం ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ , నవీపేట ఎస్ఐ సీహెచ్. తిరుపతి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Next Story