- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలి ; బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రమేష్ రావు
దిశ, తాడ్వాయి : బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తాడ్వాయి మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రమేష్ రావు పేర్కొన్నారు. బీసీలకు 42

దిశ, తాడ్వాయి : బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తాడ్వాయి మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రమేష్ రావు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని, న్యాయస్థానంలో నిలబడలేని జీవోతో ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు.ఈ సందర్భంగా రమేష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాల వల్ల బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కడం తేట తెల్లమైందని అన్నారు. న్యాయస్థానంలో నిలబడలేని జీవోను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం దారుణం అన్నారు. ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని రమేష్ రావు తీవ్ర ఆరోపణ చేశారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని రమేష్ రావు పేర్కొన్నారు.






