- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదు : బీఆర్ఎస్
దిశ, నాగిరెడ్డిపేట్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేకనే 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా చేస్తున్నదని బీఆర్ఎస్ మండల

దిశ, నాగిరెడ్డిపేట్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేకనే 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా చేస్తున్నదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రాం ప్రతాప్ థియేటర్ లో మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? అని ప్రశ్నించారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారే తప్ప.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు పై పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రంలో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, నాయకులు ధార బోయిన కృష్ణ, వెంకట్ రెడ్డి, మోతే శ్రీనివాస్, రాజారెడ్డి, సిద్ధిరాంరెడ్డి, సాయిబాబా, హన్మంత్ రెడ్డి, యాదగిరి, ఫరీద్, లక్ష్మీకాంతం, నరేష్, గోపాల్ పాల్గొన్నారు.






