- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ ఆగ్రహం
దిశ,తాడ్వాయి : వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యేపై చేసిన సోషల్ మీడియాలో చాటింగ్ స్క్రీన్ షాట్‌ల వివాదం తాడ్వాయిలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆ స్క్రీన్ షాట్‌లను ఫార్వార్డ్ చేసిన

X
దిశ,తాడ్వాయి : వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యేపై చేసిన సోషల్ మీడియాలో చాటింగ్ స్క్రీన్ షాట్‌ల వివాదం తాడ్వాయిలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆ స్క్రీన్ షాట్‌లను ఫార్వార్డ్ చేసిన బీఆర్‌ఎస్ నాయకుడిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ నాయకులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎస్సై, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. వివరాల్లోకి వెళ్తే ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు ఎల్లారెడ్డి ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూప్‌లో దీనిపై చర్చించారు.ఈ చాటింగ్ స్క్రీన్ షాట్ ఫోటోలను అఖిల పక్షం తాడ్వాయి అనే వాట్సాప్ గ్రూప్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు ఫార్వార్డ్ చేశారు. ఈ పోస్టింగ్ తీవ్ర చర్చనీయాంశమై వివాదానికి దారితీసింది.
స్క్రీన్ షాట్‌లు ఫార్వార్డ్ చేసినందుకు ఎస్సై సంగోజీవాడి గ్రామానికి చెందిన తాజ్ కి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో తాజ్ ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన బీఆర్‌ఎస్ నాయకుడు కపిల్ రెడ్డి కేవలం వాట్సాప్‌లో ఒక పోస్ట్ చేసినంత మాత్రాన పోలీసులతో ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం తగదని అన్నారు. గతంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే ఎస్సై బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Next Story






