మ‌ళ్లీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంది

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఆర్మూర్‌లోని క్షత్రియ సమాజ్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు.

మ‌ళ్లీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంది
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఆర్మూర్‌లోని క్షత్రియ సమాజ్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆశన్నగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గల్లీ గల్లీలో “మళ్లీ కారే కావాలి.. కేసీఆర్‌నే కావాలి” అనే నినాదం వినిపిస్తోందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు.

రైతులు పండించిన వడ్లు, మక్కలను వెంటనే కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు జరగక రైతులు బోరున విలపిస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లో రాక్షస పాలన కొనసాగు తోందని, మైనర్ బాలికపై దారుణ ఘటన జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ రైతుల మక్కలు, వడ్లు కొనాలని చెప్పినందుకు అతనిని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్నారు. మాట్లాడితే కేసులు, ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మాట్లా డినా కేసులు నమోదు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేసి రైతన్న గుండెల్లో నిలిచిపోయిందని పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్య క్రమంలో వీ.జీ. గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, విఠల్ రావు , సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిశాంక్ , విజయ భారతి, రాజారాం యాదవ్, పూజ నరేందర్, పృద్వి, గోవింద్ పెట్ ఈ. గంగాధర్,నచ్చు చిన్నారెడ్డి, మాస్త ప్రభాకర్, రిక్కల రాజు రెడ్డి, విజయ్ కుమార్, పాల్గొన్నారు.

Next Story