కో-ఆప్షన్ సభ్యుల ఎంపికతో బీఆర్ఎస్ కి మరింత బలం

by Ratna Kumari |

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ తరఫున కో-ఆప్షన్ సభ్యులుగా కుంభాల రవి, షౌకత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

కో-ఆప్షన్ సభ్యుల ఎంపికతో బీఆర్ఎస్ కి మరింత బలం
X

దిశ, కామారెడ్డిటౌన్ : కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ తరఫున కో-ఆప్షన్ సభ్యులుగా కుంభాల రవి, షౌకత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికతో కౌన్సిల్ మరింత బలోపేతం అవుతుందని, పట్టణంలో పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన‌ అనంతరం కుంభాల రవి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. షౌకత్ మాట్లాడుతూ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, మున్సిపల్ పాలనలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story