బ్రెయిలీ ఒక లిపి కాదు.. అంధుల ఆశాజ్యోతి : కమిషనర్ పోతరాజు సాయిచైతన్య

by Ratna Kumari |

లూయీ బ్రెయిలీ ఒక లిపి మాత్రమే కాదని, అంధుల ఆశాజ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య అన్నారు.

బ్రెయిలీ ఒక లిపి కాదు.. అంధుల ఆశాజ్యోతి : కమిషనర్ పోతరాజు సాయిచైతన్య
X

దిశ, నిజామాబాద్ రూరల్ : లూయీ బ్రెయిలీ ఒక లిపి మాత్రమే కాదని, అంధుల ఆశాజ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అందుల వనరుల కేంద్రం ఆవరణలో అంధుల అక్షర ప్రదాత, బ్రెయిలీ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బి, జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. కంటి చూపులేని వారి అభ్యున్నతికి అంధత్వమనేది ఒక అడ్డు కాకూడదని, సమాజంలో మిగతా వారిలాగే వారు సైతం ఉన్నత శిఖరాలకు ఎదిగేలా వారిలో ఆత్మవిశ్వాసం కల్పించే దిశగా లూయి బ్రెయిలీ తన తండ్రి ప్రోత్సాహంతో ప్రత్యేకంగా లిపిని తయారు చేశారని సీపీ గుర్తు చేశారు. కంటి చూపులేకపోయినా ప్రపంచాన్ని చూడాలనే ఆలోచన ద్వారా బ్రెయిలీ లిపి లిఖించడం సాధ్యమైందన్నారు. దివ్యాంగులకు ఎన్ని అడ్డంకులెదురైనా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సీపీ అన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆశ అనేది ఉంటేనే కసిగా ఉన్నత స్థాయిలోకి వెళతారన్నారు. స్నేహా సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి , కార్యదర్శి సిద్దయ్య , స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతి ఒక్కరి సహకారంతో స్నేహా సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్నేహా సొసైటీలోని అంధ విద్యార్థులు చోటు సంపాదించుకున్నారన్నారు.

దివ్యాంగ ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ సైతం కృషి చేస్తుందని సీపీ సాయిచైతన్య తెలిపారు. అనంతరం సొసైటీ లోని విద్యార్థులకు సీపీ నోటు బుక్కులను, పెన్నులను పంపిణీ చేశారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య అంధుల వనరుల కేంద్రంలో ఉన్న వసతులు, దివ్యాంగ విద్యార్థుల ఉన్నతి కోసం కావలసిన సౌకర్యాలను జిల్లా సంక్షేమాధికారిణి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో రాణించడం దివ్యాంగుల ఉన్నతికి నిదర్శనమని జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బి అన్నారు. స్నేహ సొసైటీ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణను ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ అంధల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సీడీపీఓ సౌందర్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న ,వీసీఈఏ అధ్యక్షుడు సాగర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆరోగ్య రాజు, అంధ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ క్యాలెండర్ ను సీపీ సాయి చైతన్య ఆవిష్కరించా. రు అంద విద్యార్థిని రజని స్నేహ సొసైటీ పాఠశాలకు రూ. 50 వేల విలువైన క్లాస్ రూమ్ బెంచీలను విరాళంగా అందించారు.

Next Story