పాముకాటుకు గురైన బాలుడు మృతి

by Bhanu |

నస్రుల్లాబాద్ మండలం, సంగెం తండాలో పాముకాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

పాముకాటుకు గురైన బాలుడు మృతి
X

దిశ, బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండలం, సంగెం తండాలో పాముకాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. సంగెం తాండకు చెందిన డేగవత్ అశోక్ కు ముగ్గురు అమ్మాయిలు, ఓక్కడే బాబు ఉన్నాడు. బాలుడు రిషి కుమార్ ఇంట్లో ఆడుకుంటుండగా నాగు పాము కాటు వేయడంతో హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుండి నిజామబాద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు ఆస్పత్రిలో వైద్యులు తెలిపారు. ఒక్కగాననొక్క కొడుకు చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story