వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

by Ratna Kumari |

అనారోగ్యానికి గురైన తమ బిడ్డను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే.. నాణ్యమైన వైద్యాన్ని అందించి బిడ్డను బతికించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిడ్డ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో సోమవారం చోటుచేసుకుంది.

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అనారోగ్యానికి గురైన తమ బిడ్డను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే.. నాణ్యమైన వైద్యాన్ని అందించి బిడ్డను బతికించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిడ్డ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో సోమవారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి తమ బిడ్డ బలయ్యాడంటూ బాధిత పేరెంట్స్ , బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ తండాకు చెందిన శిరీష, నరేష్ దంపతుల కొడుకు 15 నెలల నిక్షిత్ కు ఉన్నట్టుండి సోమవారం వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. డీ హైడ్రేషన్ తో బాబు చాలా నీరసించిపోవడంతో చికిత్స కోసం బాబును పేరెంట్స్ హుటాహుటిన జిల్లా కేంద్రంలోని సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రికి తరలించారు.


బాబుకు బ్లడ్ తక్కువగా ఉందని, హార్ట్ బీట్ కూడా స్లోగా ఉందని చెప్పి హాస్పిటల్ లో అడ్మిట్ చేయించుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే బాబు ఒంటిపై దద్దుర్లు రావడం, ఎం ఆర్ ఐ స్కాన్ తీయడం వంటివి చేశారు. అయినా బాబు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. బాబును బతికించేందుకు చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసామని చెప్పి డాక్టర్లుచేతులు దులిపేసుకుంటున్నారనివాపోయారు. మంచి వైద్యం అందించిబిడ్డను బతికిస్తారనుకుంటే చంపేశారంటూ ఆస్పత్రి వైద్యులపై దుమ్మెత్తిపోసారు. ఆస్పత్రి ముందు బంధువులు, తండా వాసులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నిర్లక్ష్య వైద్యంతో పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై బాబు తండ్రి నరేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.

Next Story