- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యం
దిశ, నిజాంసాగర్ : మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృత దేహం

దిశ, నిజాంసాగర్ : మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైన సంఘటన నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డెపల్లి గ్రామ శివారులో పిట్లం-నిజాంసాగర్ ప్రధాన రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. అతని శరీరం పై నీలిరంగు చొక్కా ఉంది. కాపీ రంగు ఫ్యాట్.. దానిపై నెట్ ప్లే మోడ్రన్ క్యాజువల్ అని రాసి ఉందని.. నీలి రంగు బనియన్ ఉందని.. ఎడమ భుజం పై సూర్యని బొమ్మ, మధ్యలో అమ్మ అని తెలుగు పచ్చ బొట్టుతో రాసి ఉంది. అలాగే శివ, నరేష్ అని కూడా రాసి ఉంది. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏమి తెలియదు. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో శరీర భాగాలకు గాయాలై మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో ఉందని.. ఎవరైనా సంప్రదించాలంటే.. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ 8712686172...8712666221 నెంబర్లకు సంప్రదించవచ్చు.






