- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న బీజేపీ నేత..
ఆర్మూర్ వాసికి అత్యవసర సమయంలో సామాన్య మానవుడి తరహాలో ఒకరి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రక్తదానం చేసి ఆపద్బాంధవుడు అయ్యాడు.

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ వాసికి అత్యవసర సమయంలో సామాన్య మానవుడి తరహాలో ఒకరి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రక్తదానం చేసి ఆపద్బాంధవుడు అయ్యాడు. ఆర్మూర్ కు చెందిన వ్యక్తికి రక్తం అవసరం ఉందన్న సమాచారం మేరకు వెంటనే స్పందించి రక్తదానం చేసి ఆర్మూర్ కు చెందిన బీజేపీ నాయకుడు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.
హైదరాబాద్ ఉషాముళ్ళపూడి ఆసుపత్రిలో ఆర్మూర్ కి చెందిన బాలాజీ జ్యువలర్స్ కిషన్ సేటు సోదరుడు శ్రీరామ్ రమణయ్యకి అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడింది. దీంతో బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకుడు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు. ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి చేసిన రక్తదానం పట్ల ఆర్మూర్ బీజేపీ నాయకులు, పట్టణ ప్రముఖులు వినయ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో రక్తమందించి ఆర్మూర్ ప్రాంతంలో పలువురికి వినయ్ కుమార్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు.






