- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది అసత్య ప్రచారం.. దేవుని పై ప్రమాణం చేసిన బీజేపీ నాయకురాలు
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కండ రాయుడు మల్లయ్య మందిరంలో బుధవారం ఆలూరు గంగారెడ్డి కుతురు విజయభారతి రెడ్డి ప్రమాణం చేశారు.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కండ రాయుడు మల్లయ్య మందిరంలో బుధవారం ఆలూరు గంగారెడ్డి కుతురు విజయభారతి రెడ్డి ప్రమాణం చేశారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి వద్ద నుంచి విజయభారతి రెడ్డి 40 లక్షల తీసుకున్నట్లు ఆర్మూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఆరోపణలు చేశారు. దీంతో విజయభారతి రెడ్డి బుధవారం మల్లయ్య మందిరానికి చేరుకుని ఎమ్మెల్యే అభర్ధి నుంచి రూ.40 లక్షలు తీసుకున్న మాట అసత్యమని శివలింగం పై ప్రమాణం చేశారు.
ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని విజయభారతి హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి చిట్టాను అతిత్వరలో విడుదల చేస్తానని ఈ సందర్భంగా విజయ భారతి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంలో గతంలో ఆలూరు గంగారెడ్డి చేసిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆలూరు గంగారెడ్డి నీతికి, నిజాయితీకి మంచి పేరని ఆయన బిడ్డనైన తాను ఎల్లప్పుడు నిజాయితీగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల ప్రజలు పాల్గొన్నారు.






