- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ కుట్ర
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు.

దిశ, కామారెడ్డి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి వీబీజీ రాంజీ చట్టాన్ని తేవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందన్నారు. లోక్ సభలో 100కు పైగా ఎంపీలు దీనిపై కొట్లాడుతున్నారన్నారు. పేదలకు కాకుండా ధనవంతులకు బీజేపీ పని చేస్తుందన్నారు. గాంధీ వాదం పేరు చెబుతూనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తుందని ఆరోపించారు. పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అలాంటి పథకాన్ని పూర్తిగా తొలగించేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, గోనె శ్రీనివాస్, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.






