తక్షణమే యూరియా సరఫరా చేయాలి

by velandi.Saikiran |

రైతుల సమస్యలు పరిగణలోకి తీసుకోని వెంటనే యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది.

తక్షణమే యూరియా సరఫరా చేయాలి
X

దిశ, కామారెడ్డి : రైతుల సమస్యలు పరిగణలోకి తీసుకోని వెంటనే యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది. మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డిని కలిసి కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత ఉండటంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రైవేట్ వ్యాపారులు మాఫియాగా తయారవుతున్నారని, యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలకు విక్రయిస్తూ అవసరం లేకున్నా ఇతర మందులు అంటగడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కార్యదర్శి శంకర్ రావు జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, రమణారెడ్డి, గోపాల్ రెడ్డి, అంజన్న, భైరవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story