బ్యాటరీల దొంగ పట్టివేత

by Muthe.Rajitha |

ట్రాక్టర్లతో పాటు, ఇతర వాహనాల నుంచి గత కొంతకాలంగా బ్యాటరీలను అపహరించుకుపోతున్న వ్యక్తిని, సిసి ఫుటేజ్ లో నిక్షిప్తమైన వివరాల ఆధారంగా ట్రాక్టర్ యజమానులు కొందరు చాకచక్యంగా దొంగను పట్టుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

బ్యాటరీల దొంగ పట్టివేత
X

దిశ భిక్కనూరు : ట్రాక్టర్లతో పాటు, ఇతర వాహనాల నుంచి గత కొంతకాలంగా బ్యాటరీలను అపహరించుకుపోతున్న వ్యక్తిని, సిసి ఫుటేజ్ లో నిక్షిప్తమైన వివరాల ఆధారంగా ట్రాక్టర్ యజమానులు కొందరు చాకచక్యంగా దొంగను పట్టుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సి సి ఫుటేజ్ లో నిక్షిప్తమైన వివరాల ప్రకారం ఒక బైక్ సిపిఎస్ స్కూల్ సమీపంలోని రోడ్డుపై పార్క్ చేసి ఉండడాన్ని గమనించిన కొందరు ట్రాక్టర్ యజమానులు, రాత్రి 9 గంటల వరకు బైక్ యజమాని కోసం అక్కడే అరుగులపై కాపలా కాస్తు కూర్చున్నారు.. బైకు యజమాని ఎవరన్నది ముందే వారికి తెలిసిపోయింది. దీంతో అనుమానాస్పదంగా బయటకి లోపలికి వచ్చి చూసి వెళ్తున్న అనుమానితుని ఇంటి వైపు చూశారు. ట్రాక్టర్ యజమానులతో పాటు కాలనీవాసులు అంతా కలసి ఆ ఇంటిని చుట్టుముట్టారు. నా భర్తను కొట్టవద్దని, మీకు కావలసిన బ్యాటరీలు ఇస్తానని చెప్పి, భర్త దొంగిలించుకు వచ్చిన వస్తువులన్నింటిని వారికి అందజేసి కొట్ట వద్దని బ్రతిమాలుతూ దండం పెట్టింది.

ఈ విషయం స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఎస్ఐ లు ఆంజనేయులు, దత్తాత్రి గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ యజమానుల చేతికి చిక్కిన దొంగ నుంచి బ్యాటరీలు, సీసీ కెమెరా, డంబుల్స్, వంట చేసుకునే స్మాల్ గ్యాస్ పోయి సిలిండర్ ను స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ యజమానులు, వస్తువులను పోలీసులకు అప్పగించేందుకు మొదట్లో నిరాకరించారు. చివరకు పోలీసులు వారికి నచ్చజెప్పి, కోర్టు ద్వారా వస్తువులు రికవరీ అవుతాయని, మీ వస్తువులు ఎక్కడికి పోవని చెప్పడంతో, అప్పటివరకు రచ్చ రచ్చ చేసిన ట్రాక్టర్ యజమానులు శాంతించి పోలీసులకు అప్పగించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో బ్యాటరీల దొంగ ను పోలీసులు జీప్ లో ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు.

Next Story