బాన్సువాడలోక్షుద్ర పూజల కలకలం.

by Bhanu |

బాన్సువాడ పట్టణం గౌలిగూడ లొ క్షుద్ర పూజల కలకలం రేపాయి.గొల్ల రుక్కుం బాయి అనె మహిళ ఇంట్లో కాలని వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి.

బాన్సువాడలోక్షుద్ర పూజల కలకలం.
X

దిశ: బాన్సువాడ : బాన్సువాడ పట్టణం గౌలిగూడ లొ క్షుద్ర పూజల కలకలం రేపాయి.గొల్ల రుక్కుం బాయి అనె మహిళ ఇంట్లో కాలని వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. రుక్కుం బాయి ప్రక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఏమి శబ్ధాలు అని అడిగే సరికి బాత్ రూమ్ కోసం తవ్వుతున్నామని చెప్పారు. పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి తనకు తెలియకుండానే కుక్కర్ విసిరి పడేయటం పిల్లలను కొట్టడం గమనించిన ఇంటి ముందు నివాసం ఉన్నవారు చెప్పడంతో అనుమానం వచ్చి కాలని వాసులు గొల్ల రుక్కుం బాయి ఇంట్లో వెళ్ళి చూసే సరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ,కొబ్బరి కాయలు,నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్ర పూజల అని అనుమానంతో వారిని పట్టి దేహశుద్ధి చేసి ఇంటి యజమాని గొల్ల రుక్కుం బాయి ని పోలీసులకు అప్పగించారు.సుమారు 8 మంది క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్లు కాలని వాసులు తెలిపారు.వీరు నారాయణఖేడ్ ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంత సరిహద్దు నుండి వచ్చినట్లు తెలిపారు.




Next Story