- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం
దిశ, బాన్సువాడ : ఈ మధ్య కాలంలో దొంగనోట్లు హల్ చల్ సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో తాజాగా

దిశ, బాన్సువాడ : ఈ మధ్య కాలంలో దొంగనోట్లు హల్ చల్ సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో తాజాగా ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సర్పంచ్ అభ్యర్థి బంధువును ఓటర్లకు పంచడానికి ఇచ్చిన ఆ డబ్బులతో కెనరా బ్యాంకు వెళ్ళి క్రాఫ్ లోన్ కట్టడానికి వెళ్లగా.. 417నకిలీ 500నోట్లు మొత్తం 2,08,500/₹ రూపాయలను బ్యాంక్ సిబ్బంది అవి నకిలీ నోట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో భయపడి గ్రామస్థులు నోట్లను కొంత మంది కాల్చివేయగా.. కొంతమంది బయటకు చెప్పుకోలేని విధంగా తన మీద కేసు నమోదు ఐతదని బాయాపడి బయట చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో సదరు కాంగ్రెస్ అభ్యర్ధి భారీ మెజార్టీ తో గెలవడం గమనార్హం. బయట చెప్పుకోలేని పరిస్థితిలో డబ్బులు తీసుకున్నవారు ఉన్నారు.






