- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లు పూర్తి.. సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్..
by Batti.Sumithra |
తమ కొనుగోలు కేంద్రం పరిధిలో ఉన్నగ్రామాల నుంచి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్ తెలిపారు.

X
దిశ, భిక్కనూరు : తమ కొనుగోలు కేంద్రం పరిధిలో ఉన్నగ్రామాల నుంచి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు వివరించారు. అందరికంటే ముందుగా 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జేసీ చంద్రమోహన్, సివిల్ సప్లై అధికారులతో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story






